దాసరి నారాయణరావు , Narayanarao Dasari

  • ======================================================
పరిచయం:
  • డా. దాసరి నారాయణరావు - రాజకీయనాయకుడు, సినిమా దర్శకుడు మరియు సినీ నిర్మాత. కళాశాలలో చదివేరోజులలో బీ. డిగ్రీతోపట్టబధ్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవాడు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థలనటుడి గా, నాటక రచయిత గా చిత్ర దర్శకుడి గా గుర్తింపు పొందారు. దాసరి నారాయణరావు దాదాపు 150 చిత్రాలకుదర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగాలేదా గీతరచయితగా పనిచేశాడు. దాసరి తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగానుఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే పదానికితెలుగుసినీరంగంలో ఉదాహరణగా ఈయన గురించి చెబుతారు.
  • ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు. ఒకానొకసమయంలో ఈయన పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయనప్రాచుర్యానికి అద్దం పడుతుంది.
జీవిత విశేషాలు :
  • పేరు : నారాయణరావు , దాసరి
  • పుట్టిన తేది : 1947, మే 4
  • పుట్టిన ఊరు : పాలకొల్లులో జన్మించాడు. పశ్చిమ గోదావరి జిల్లా .
  • భార్య :పద్మ , ప్రేమవివాహము .
  • కొడుకు : దాసరి అరుణ కుమార్ నటుడు ,
  • కూతురు : అయిలమ్మ ,
  • అమ్మ : మహలక్ష్మి ,
  • నాన్న : సాయి రాజు , పొగాకు వ్యాపారము ,
  • తోబుట్టువు : తన తో కలిపి ముగ్గురు మగపిల్లలు ,ముగ్గురు ఆడపిల్లలు ,
  • చదువు :బి.కాం ,
దాసరి సినిమాలు : ఈయన సినిమాలు ముఖ్యముగా స్త్రీ ప్రధానముగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి.
  • తాతా మనవడు,
  • స్వర్గం నరకం,
  • మేఘసందేశం,
  • మామగారు -- ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి.
  • బొబ్బిలి పులి ,
  • సర్దార్ పాపారాయుడు -చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయప్రవేశములో ప్రధానపాత్ర వహించాయి.
  • సూరిగాడు ,
  • ఒసే రాములమ్మ చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. సినిమాలలో నటనకు దాసరి అనేకవిమర్శకుల ప్రశంసలు మరియు బహుమతులు అందుకున్నాడు.
అవార్డులు
  • 1974లో తాతా మనవడు సినిమాకి నంది అవార్డు అందుకున్నాడు.
  • స్వర్గం నరకం సినిమాకు ఉత్తమ చిత్రం గా బంగారు నంది బహుమతిని పొందాడు.
  • 1983లో మేఘ సందేశం చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును పొందాడు.
  • 1992లో మామగారు చిత్రానికి గాను ఉత్తమ నటుడు అవార్డును పొందాడు.
  • 1986లో తెలుగు సంస్కృతి మరియు తెలుగు చిత్ర రంగం నకు ఆయన చేసిన సేవలకు గాను ఆంధ్రా విశ్వవిధ్యాలయంనుండి గౌరవ డాక్టరేట్ ను పొందాడు.
  • ప్రముఖ సామాజిక సేవా సంస్థల నుండి అనేక అవార్డ్ లను పొందారు.వాటిలో కొన్ని వంశీ బెర్క్లే,కళా సాగర్,శిరోమణిఇన్స్టిట్యుట్ మొదలైనవి.ఫిల్మ్ ఫేర్ అవార్డును 6 సార్లు,మద్రాసు ఫిల్మ్ ఫాన్స్ అవార్డ్ ను 5 సార్లు,సినీ హెరాల్డ్ అవార్డ్ నుసంవత్సరాలు వరసగాను గెల్చుకున్నారు.
  • 10 జ్యోతి చిత్ర నుండి సూపర్ డైరెక్టర్ అవార్డ్ ను 3 సార్లు పొందారు.
  • పాత కాలం నాటి ఆంధ్ర పత్రిక నుండి ఉత్తమ దర్శకుడిగా 6 సార్లు ఎంపిక అయ్యారు.
  • ఇవి కాక ఆయన నిర్మించిన చిత్రాలలో అనేకం అవార్డ్ లను గెలుచుకున్నాయి.
  • ======================================
మూలము : ఆంధ్రజ్యోతి సండే మేగజైన్ .

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala