బి.నాగిరెడ్డి , Nagireddy

పరిచయం :
  • బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (డిసెంబర్ 2, 1912 - ఫిబ్రవరి 25, 2004) తెలుగు సినీనిర్మాత మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.
జీవిత విశేషాలు :
  • పేరు : బొమ్మి రెడ్డి నాగిరెడ్డి ,
  • పుట్టిన తేది : డిసెంబర్ 2, 1912న
  • మరణము : 25 ఫిబ్రవరి 2004
  • పుట్టిన ఊరు : కడప జిల్లా ‌పొట్టింపాడు(ఒరం పాడు) గ్రామంలోని ఒక రైతు కుటుంబంలో జన్మించాడు.
  • పిల్లలు :ముగ్గురు కొడుకులు , ఇద్దరు కుమార్తెలు .
చదువు :
  • ఆ పల్లెటూరి వీధిబడిలో రామాయణ మహాభారతాలు, భాగవతంలాంటి పురాణగ్రంథాలను మాత్రమే బోధించేవారు. ధర్మబద్ధమైన జీవితం ఎలా గడపాలో ఉపాధ్యాయుడు పిల్లలకు రోజూ చెప్పేవాడు. ప్రాచీన గ్రంథాల్లోని సూక్తులను, సుభాషితాలను పిల్లలచేత కంఠస్థం చేయించేవాడు. ఆ ఉపాధ్యాయుడి వద్ద చదువుకున్న నాగిరెడ్డి పది, పన్నెండేళ్ళు వచ్చేనాటికే పురాణేతిహాసాలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకోగలిగాడు. అవన్నీ ఆయన ఆలోచనావిధానాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి.
కెరీర్ :
  • ఆ తర్వాత ఆయన మద్రాసు (ఈనాటి చెన్నై) నగరాన్ని చేరుకుని కొన్నేళ్ళపాటు పాఠశాల విద్య అభ్యసించాడు. పాఠశాల విద్య పూర్తి కాకుండానే ఆయన తన కుటుంబం నడుపుతున్న ఎగుమతి వ్యాపార బాధ్యతలు చేపట్టవలసివచ్చింది.
  • యువకుడుగా ఆయన స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఖాదీ ఉద్యమంలో పాల్గొన్నాడు. కానీ వ్యాపార నిమిత్తం బర్మా వెళ్ళవలసి వచ్చింది. అయితే రెండవ ప్రపంచయుద్ధసమయంలో వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. ఆయన మళ్ళీ జీవితం కొత్తగా ప్రారంభించవలసివచ్చింది. ప్రింటింగ్ ప్రెస్ ను ప్రారంభించాడు. క్రమంగా ప్రచురణారంగప్రవేశానికి అదే దోహదం చేసింది. ఆంధ్రజ్యోతి అనే సామాజిక-రాజకీయ పత్రికను ప్రారంభించాడు.
చిత్రరంగంలో
  • మొదట్నుంచి నాగిరెడ్డికి పబ్లిసిటీ విభాగం పట్ల ఆసక్తి ఉండేది. ఆయన తన అన్నగారైన బి.ఎన్.రెడ్డి స్థాపించిన వాహినీ సంస్థలో భాగస్వామిగా చేరాడు. రెండవప్రపంచయుద్ధ కాలంలో (1941లో) వాళ్ళ సరుకు తీసుకువెళ్తున్న ఓడ బాంబుదాడిలో ధ్వంసం కావడంతో పెద్ద మొత్తంలో నష్టం వచ్చింది. ఆ పరిస్థితుల్లో వ్యాపారం కొనసాగించలేక తన స్వగ్రామమైన ఓరంపాడు చేరాడు. ఆ తర్వాత వాహినీ వారి భక్తపోతన కు దర్శకత్వం వహించిన కె.వి.రెడ్డి నాగిరెడ్డిని మద్రాసుకు పిలిపించి ఆ చిత్రం తాలూకు పబ్లిసిటీ వ్యవహారాలు అప్పజెప్పాడు. సరిగ్గా అదే సమయంలో జెమినీ వారి బాలనాగమ్మ విడుదలైంది. జెమినీ వారు తమ చిత్రాలకు పెద్ద ఎత్తున ప్రచారం చేయిస్తారు. దానికి దీటుగా ఉండడానికి నాగిరెడ్డి మద్రాసులో హనుమంతుడి భారీ కటౌట్లు పెట్టించి వినూత్న రీతిలో ప్రచారం చేయించాడు. ఆ పబ్లిసిటీ చిత్ర విజయానికి బాగా తోడ్పడింది. దాంతో కె.వి.రెడ్డి ఆయనకు 500 రూపాయలు బహుమతిగా ఇచ్చాడు. ఆ మొత్తంతో నాగిరెడ్డి ఒక ఆస్టిన్ కారు కొన్నాడు.
విజయా సంస్థ
  • తర్వాత 1950 లో నిర్మాతగా మారి చక్రపాణితో కలిసి విజయా ప్రొడక్షన్స్ స్థాపించాడు. ఉన్నతమైన ప్రమాణాలతో పండితపామర జనరంజకంగా సినిమాలు తీసిన విజయా సంస్థ తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని సృష్టించింది. 1950 లో వచ్చిన షావుకారుతో మొదలైన ప్రస్థానం 1962 లో వచ్చిన గుండమ్మ కథ వరకు ఉచ్ఛస్థితిలో కొనసాగింది.
ఫిల్మోగ్రఫీ :
  • ప్రొడ్యూసర్:
  • 1. శ్రీమాన్ శ్రీమతి (1982) (ప్రొడ్యూసర్) (అస్ బ. నగి రెడ్డి)
  • 2. స్వయమ్వర్ (1980) (ప్రొడ్యూసర్) (అస్ బ. నగి రెడ్డి)
  • 3. స్వర్గ నరాక్ (1978) (ప్రొడ్యూసర్) (అస్ బ. నగి రెడ్డి)
  • 4. ఏహి హాయ్ జిందగి (1977) (ప్రొడ్యూసర్) (అస్ బ. నగి బేడి)
  • ... ఆక ఏహి హాయ్ జిందగి (ఇండియా: హిందీ టైటిల్: వీడియో బాక్స్ టైటిల్)
  • 5. శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ (1976) (ప్రొడ్యూసర్)
  • 6. జూలీ (1975) (ప్రొడ్యూసర్) (అస్ బ. నగి రెడ్డి-చక్రపాణి)
  • ౭. గంగ మంగ (1973) (ప్రొడ్యూసర్)
  • 8. ఘర్ ఘర్ కి కహాని (1970) (ప్రొడ్యూసర్) (అస్ బ. నగి Reddy)
  • 9. రామ్ ఆర్ శ్యాం (1967) (ప్రొడ్యూసర్) (అస్ బ. నగి రెడ్డి)
  • 10. గుండమ్మ కథ (1962) (ప్రొడ్యూసర్)
  • 11. మనితన్ మరవిల్లై (1962) (ప్రొడ్యూసర్)
  • 12. రేచుక్క ప్రగాతిచుక్క (1959) (ప్రొడ్యూసర్)
  • 13. అప్పు చేసి పప్పు కూడు (1958) (ప్రొడ్యూసర్)
  • ౧౪. మాయ బజార్ (1957/ఐ) (ప్రొడ్యూసర్)
  • ౧౫. మాయ బజార్ (1957/ఈఈ) (ప్రొడ్యూసర్)
  • ౧౬. మిస్సమ్మ (1955) (ప్రొడ్యూసర్)
  • 17. మిస్సిఅమ్మ (1955) (ప్రొడ్యూసర్)
  • 18. చంద్రహారం (1954) (ప్రొడ్యూసర్)
  • ౧౯. పెళ్లి చేసి చూడు (1952) (ప్రొడ్యూసర్)
  • 20. పాతాళ భైరవి (1951) (ప్రొడ్యూసర్)
  • ... ఆక ది గోదేస్స్ ఫ్రొం బెలౌ ది ఎఅర్త్
  • 21. షావుకారు (1950) (ప్రొడ్యూసర్)
  • ౨౨. శోవ్కర్ (1950) (ప్రొడ్యూసర్)
Missllenious Crew :
  • 1. శ్రీమాన్ శ్రీమతి (1982) (ప్రేసేన్టర్) (అస్ బ. నగి రెడ్డి)
  • 2. స్వయమ్వర్ (1980) (ప్రేసేన్టర్) (అస్ బ. నగి రెడ్డి)
  • 3. స్వర్గ నరాక్ (1978) (ప్రేసేన్టర్) (అస్ బ. నగి రెడ్డి)
  • 4. ఏహి హాయ్ జిందగి (1977) (ప్రేసేన్టర్) (అస్ బ. నగి రెడ్డి)
  • ... ఆక ఏహి హాయ్ జిందగి (ఇండియా: హిందీ టైటిల్: వీడియో బాక్స్ టైటిల్)
  • 5. జూలీ (1975) (ప్రేసేన్టర్) (అస్ బ. నగి రెడ్డి)
  • 6. ప్రేమ నగర్ (1974) (ప్రేసేన్టర్) (అస్ బ. నగి రెడ్డి)
  • ౭. రామ్ ఆర్ శ్యాం (1967) (ప్రేసేన్టర్) (అస్ బ. నగి రెడ్డి)
  • ఎదితోరిఅల్ డిపార్టుమెంటు:
  • 1. హాయ్ హాయ్ నాయక (1989) (అసిస్టెంట్ ఎడిటర్)
డైరెక్టర్:
  • 1. ఎంగ వీటు పెన్న (1965)
థాంక్స్:
  • 1. రామ్ తేరే కితనే నం (1985) (సిన్సురే థాంక్స్) (అస్ శ్రీ నగి Reddy)
గుర్తింపు-గౌరవాలు
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (1987లో),
  • TMA పాయ్ అవార్డు,
  • రఘుపతివెంకయ్య అవార్డు,
  • తమిళనాడు ప్రభుత్వంచే కలైమామణి అవార్డు (1972లో),
  • శ్రీవేంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలనుంచి గౌరవడాక్టరేట్లు,
నిర్వహించిన పదవులు
  • ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా రెండు సార్లు,
  • సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా నాలుగుసార్లు,
  • 1980-83 మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ అధ్యక్షుడిగా
  • ఆయన నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు కూడా.
నాగిరెడ్డిగారి పద్ధతి!
విజయా సంస్థ అధినేత నాగిరెడ్డిగారు అప్పుడప్పుడు చందమామ బిల్డింగ్స్‌కి వచ్చి అన్నీ చూస్తూ వెళ్లేవారు. స్టూడియోలో కూడా అంతా తిరుగుతూ, ఎక్కడైనా చిన్న కాగితం ముక్క కనిపిస్తే ఆయనే దాన్ని తీసి, పక్కన వున్న చెత్త డబ్బాలో వేసేవారు. అది చూసిన పనివారు అప్రమత్తులయ్యేవారు. ''నాగిరెడ్డిగారిని చూసి, నేనూ అలాగే స్టూడియోలో తిరగడం, చెత్త వుంటే తీసి పారేయడం, వరస క్రమంలో లేని వాటిని సవ్యంగా పెట్టించడం వంటివి నేర్చుకున్నాను'' అని నాగేశ్వరరావు గారు చెబుతుంటారు. చందమామ, విజయ చిత్రాల ఆఫీసుకి నాగిరెడ్డిగారు వచ్చి తిరుగుతున్నప్పుడు - ఒకనాడు నా కారు చూశారు. కారు పార్కింగ్‌ నిండిపోయిందని, నేను కారుని లారీలు పార్కు చేసే చోట పెట్టాను - ఖాళీగా వుందని. ఆ కారు ఎవరిదని నాగిరెడ్డిగారు అడిగారుట, నాది అని చెప్పారుట. వెంటనే నన్ను పిలిచారు. వెళ్లి నమస్కరించాను. ''ఇక్కడ కారు ఎందుకు పెట్టావు? ఇది ఏదో లారీలు, సామాన్లు తెచ్చే బళ్లూ పెట్టే చోటు. కార్లకి ఇది సరైన స్థలం కాదు. సరైన స్థలం కారు పార్కింగ్‌. లక్షణంగా అక్కడ పెట్టుకోవచ్చుగదా...'' అని వ్యంగ్యంగా మందలించారు. ''కారు పార్కింగ్‌లో చోటు లేదని ఇక్కడ పెట్టాను'' అని అంటూనే, కారు తీసే ప్రయత్నం చేశాను. ఖివ్ని వ్ని... Here after it is better to park there'' అన్నారు. కె.వి.రెడ్డిగారు, బి.ఎన్‌.రెడ్డిగారు, నాగిరెడ్డిగారూ అందరూ ఎక్కువగా ఇంగ్లీషులోనే మాట్లాడేవారు. ఏది ఎక్కడ వుండాలో అది అక్కడ వుండాలి. అంత కచ్చితంగా వుండేవారు నాగిరెడ్డిగారు. అందుకే ''వాహిని- విజయా స్టూడియోలంత అందమైన, పద్ధతి అయినవి భారతదేశంలో ఇంకోటి లేదు'' అన్న పేరు తెచ్చుకుంది.

courtesy with Pathabangaram by Ravi kondalarao
  • ==================
 visit my website : Dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala