Dasarathi Rangacharya(Writer)-దాశరథి రంగాచార్య(ప్రముఖ రచయిత)







పరిచయం (Introduction) : 

  • రాలిపోయిన మోదుగుపువ్వు - ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య కన్నుమూత -అనారోగ్యంతో ఆస్పత్రిలో మృతి -నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు 



సాహితీ శిఖరం కూలిపోయింది. తెలంగాణ మోదుగుపువ్వు రాలిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య(86) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో కన్నుమూశారు. గుండె, వూపిరితిత్తుల సమస్యలను ఎదుర్కొంటూ... రెండేళ్ల నుంచి యశోదలోనే చికిత్స తీసుకుంటూ వచ్చారు. సికింద్రాబాద్‌, వెస్ట్‌మారేడుపల్లిలోని తన స్వగృహంలో ఉంటున్న ఆయన ఆదివారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కుటుంబసభ్యులు ఆయనను సాయంత్రం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అధిక రక్తపోటుతోపాటు చక్కెర బాగా పెరిగింది. ఎంత ప్రయత్నించినా నియంత్రణలోకి రాలేదు. సోమవారం ఉదయానికి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. శరీర భాగాలు వైద్యానికి స్పందించకపోవడంతో చివరికి ఆరు గంటల సమయంలో ఆయన మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయనకు భార్య కమల, ముగ్గురు పిల్లలు విరించి, ఉదయశ్రీ, సుధ ఉన్నారు. ఆయన దాదాపు 54 రచనలు చేశారు. చిల్లర దేవుళ్లు, మోదుగుపూలు, జానపదం నవలలు రచించి సాహితీ రంగంలో విశేష ప్రశంసలు అందుకున్నారు. తెలంగాణ జీవనచరిత్రను తన రచనల్లో కళ్లకు కట్టినట్లు వివరించారు. 1969లో రచించిన చిల్లర దేవుళ్లు రచనకు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తర్వాత ఇది సినిమాగా వివిధ భాషల్లోకి అనువాదమూ అయింది. డాక్టర్‌ రంగాచార్య మృతివార్త తెలియడంతో సాహితీలోకం దుఃఖసాగరంలో మునిగిపోయింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖరరావు, నారా చంద్రబాబునాయుడు తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రభుత్వ లాంఛనాలతో మంగళవారం వెస్ట్‌మారేడుపల్లిలోని హిందూ స్మశానవాటికలో దాశరథి అంత్యక్రియలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రోటోకాల్‌ విభాగ అదనపు సంచాలకులు విజయ్‌కుమార్‌ పర్యవేక్షించారు. దుబాయ్‌, అసోంల నుంచి దాశరథి మనవరాలు, మనవడు వస్తున్నారని... మధ్యాహ్నం 12 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
దాశరథి రంగాచార్య 1928 ఆగస్టు 24న వరంగల్‌ జిల్లా చిన్నగూడూరులో (ప్రస్తుతం ఆ గ్రామం ఖమ్మం జిల్లాలో ఉంది) దాశరథి వేంకటాచార్యులు, వెంకటమ్మలకు రెండో సంతానంగా జన్మించారు. 'నా తెలంగాణ...కోటి రతనాల వీణ' అని పలికిన దాశరథి కృష్ణమాచార్యకు ఆయన స్వయనా తమ్ముడు. తర్వాత వీరి కుటుంబం ఖమ్మంలో స్థిరపడింది. రంగాచార్య చిన్నతనంలో సంప్రదాయ వాతావరణంలో పెరిగారు. చిన్నప్పటి నుంచి ఆయనది పోరాట పంథానే. అదే ఆయనను తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనేలా చేసింది. నిజాంకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ విముక్తికి పాటుపడ్డవారిలో ఆయన ఒకరు. రంగాచార్య బీఏ ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, డోర్నకల్‌లో ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1958లో సికింద్రాబాద్‌ మున్సిపల్‌ విభాగంలో అనువాదకునిగా చేరారు. వృత్తి జీవితంలో అంచెలంచెలుగా ఎదిగి సహాయ కమిషనర్‌గా 1988లో పదవీ విరమణ పొందారు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే సాహిత్య ప్రక్రియ కొనసాగించారు. 1960ల్లో రచనా జీవితాన్ని ప్రారంభించి, చివరి శ్వాసవరకూ దానిని కొనసాగిస్తూ వచ్చారు. పండితులకు మాత్రమే అర్థమయ్యే వేదాలను చక్కని తేటతెల్లమైన తెలుగులో రాశారు. శ్రీమద్రామాయణం, శ్రీమహాభారతాలను సరళంగా తెలుగులో రచించి, అభినవ వ్యాసునిగా బిరుదు పొందారు. నల్లవాగు పేరిట 21 కథలను సంకలనంచేశారు. ఆత్మకథ జీవనయానంతోపాటు దేహదాసు ఉత్తరాలు, శకుంతల, మహాత్ముడు, మాయజలతారు, జనపదం, ప్రేమ్‌చంద్‌ జీవితం, సీతాచరితం, మానవత, శరతల్పం, హరివంశము, బుద్ధభానుడు తదితర ఇతర ఎన్నో రచనలు చేశారు. వాటికి ఎన్నో పురస్కారాలు దక్కాయి. తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారంతో ఆయనను సత్కరించింది. కాకతీయ విశ్వవిద్యాలయం... 1978లోనే 'డాక్టరేట్‌'తో ఆయనను గౌరవించింది.

--ఈనాడు - హైదరాబాద్‌.

  • *==============================* 

visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala