Mada venkateswararao-మాడా వెంకటేశ్వరరావు









పరిచయం (Introduction) :

  • Mada venkateswararao-మాడా వెంకటేశ్వరరావు తెలుగు సినీ హాస్యనటుడు. ఇటీవల హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం(24-10-2015) తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా కడియంలో అక్టోబర్‌ 10, 1950న జన్మించిన మాడా సినిమాల్లోకి రాకముందు విద్యుత్‌ సంస్థలో ఉద్యోగం చేశారు. తనదైన హాస్యంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన అక్కినేని నటించిన అందాల రాముడు ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేశారు. బాపు దర్శకత్వంలో రూపొందిన ముత్యాలముగ్గు చిత్రంలో ఆయన పోషించిన 'మాడా' పాత్ర ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అనంతరం దాసరి నారాయణరావు తన చిత్రాల్లో వరుస అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిల్లరకొట్టు చిట్టెమ్మలో మాడా పోషించిన పువ్వుల కొమ్మయ్య పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. మాయదారి మల్లిగాడు, రాధాకృష్ణ, మల్లెపూలు, ఏకలవ్య తదితర చిత్రాలతో పాటు దాదాపు 60కి పైగా చిత్రాల్లో నటించారు. ఇతడు నపుంసక పాత్రలకు పెట్టింది పేరు.మాడాకు అభినయ కళానిధి అనే బిరుదు ఉంది. చూడు పిన్నమ్మ అనే పాత్రతో మాడాకు మంచి గుర్తింపు వచ్చింది.

 జీవిత విశేషాలు (profile) :

  • పేరు : మాడా వెంకటేశ్వరరావు,
  • పుట్టిన ఊరు : కడియం (తూర్పుగోదావరి జిల్లా),
  • పుట్టిన తేదీ : 10-10-1950,


 నటించిన సినిమాలు (filmography ): 

  • అందాలరాముడు 
  • ముత్యాల ముగ్గు ,
  • చిల్లరకొట్టు చిట్టెమ్మ ,
  • మాయదారి మల్లిగాడు ,
  • సఖియా, 
  • శివయ్య 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala